జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తం : ప్రియాంక కక్కర్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తం : ప్రియాంక కక్కర్
  • ఆప్ జాతీయ ముఖ్య అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్

ట్యాంక్ బండ్, వెలుగు: తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ ముఖ్య అధికార ప్రతినిధి,  రాష్ట్ర ఇన్​చార్జ్ ప్రియాంక కక్కర్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 19న నిజామాబాద్, ఆర్మూర్ లో బైక్ ర్యాలీ, నిర్మల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆదివారం లిబర్టీలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా విభాగం అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని చోట్లా పోటీ చేస్తోందన్నారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తమ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారని, అదే తరహాలో తెలంగాణను కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని దీనికి ప్రజలు తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. నేతలు బుర్ర రాముగౌడ్, అన్సారి, విజయ్ మల్లంగి, అబ్దుల్, సుధారాణి, రమ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.