తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని (84) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం (మే 30, 2026) ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న అజిత్ కుమార్‌కు ఈ విషాద వార్త తెలియగానే వెంటనే చెన్నైకి బయల్దేరినట్లు సమాచారం. కాగా, మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి కూడా మరణించగా, ఇప్పుడు తల్లి మోహిని మృతితో ఆయన కుటుంబం మరో విషాదంలో మునిగిపోయింది.
మోహిని అంత్యక్రియలు చెన్నైలోని పలవక్కంలో ఉన్న కుటుంబ నివాసంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అజిత్ కుమార్‌కు తల్లి మరణం తీరని లోటుగా మారింది. ఈ విషాద వార్తతో తమిళ చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
