నారప్పలో నటించడం నా అదృష్టం

నారప్పలో నటించడం నా అదృష్టం

సినిమాలు, వెబ్ సిరీసులు, టీవీ షోస్... మూడింటా తనదైన మార్క్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్తోంది ప్రియమణి. వెంకటేష్‌‌‌‌‌‌‌‌కి జంటగా ఆమె నటించిన ‘నారప్ప’ ఈ నెల 20న​ అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌లో విడుదలవుతున్న సందర్భంగా సినిమా గురించి, తన కెరీర్ గురించి ప్రియమణి ‘వెలుగు’తో ఇలా ముచ్చటించారు.

‘‘నారప్పలో నాది పల్లెటూరి గృహిణి పాత్ర. తెలుగులో ఇలాంటి రా అండ్ రస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీలో నటించడం ఇదే మొదటిసారి. చాలా ఎక్సైటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. ఈ సినిమాకి అడగకముందే ‘అసురన్’ చూశాను. చాలా నచ్చింది. అందుకే వెంటనే ఓకే చెప్పాను. రీమేక్స్ అన్నాక కంపేరిజన్స్ కామన్. వాటిని ఆపలేం. కన్నడలో చాలా రీమేక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించాను కనుక సుందరమ్మ పాత్రని నా స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేశాను. ఒరిజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంజు వారియర్ అద్భుతంగా నటించారు. అందులో నేను ఐదు నుండి పది శాతం చేసినా హ్యాపీనే. సురేష్ ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు (నారప్ప, విరాటపర్వం) చేయడం హ్యాపీ. ‘పెళ్లైన కొత్తలో’ సినిమా షూటింగ్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామానాయుడు స్టూడియోలో కొన్ని ఫొటోస్ చూశాను. ఆ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించిన హీరోయిన్స్ ఫొటోలవి. ఎప్పటికైనా నా ఫొటో కూడా అక్కడ ఉండాలనుకున్నాను. ఫొటో ఉంటుందో లేదో తెలీదు కానీ, సురేష్ బాబు నిర్మాణంలో వర్క్ చేశాను, వెంకీ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, రానాతో కలిసి పని చేశాననే హ్యాపీనెస్ ఉంది. నిజానికి గతంలో రెండు మూడుసార్లు వెంకటేష్ గారితో పనిచేసే చాన్స్ వచ్చినా డేట్స్ కుదరక చేయలేకపోయాను. బహుశా ‘నారప్ప’కే అది రాసి పెట్టుందేమో. నేను క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. లేదంటే ఈపాటికే వంద సినిమాలు పూర్తి చేసేదానిని. పెళ్లి తర్వాత కూడా సినిమాల ఎంపికలో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఉంటే సినిమాలు చేసేదానినే కాదేమో. కంఫర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపిస్తేనే ఏ పాత్రయినా చేస్తున్నాను.

పేద, మధ్య తరగతి వైఫ్ క్యారెక్టర్సే కాదు.. రిచ్ ఉమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ నటించాలనుంది. నెగిటివ్ క్యారెక్టర్ చేసేందుకూ రెడీ. సినిమాతో పోల్చితే వెబ్ సిరీస్ వర్కింగ్ స్టైల్ కొంత డిఫరెంట్. షూటింగ్ ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరుగుతుంది. సింక్ సౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎక్కువగా వాడతారు. రెండు కెమెరాలతో రోజుకు ఏడెనిమిది సీన్స్ ఈజీగా తీసేస్తారు. ప్రస్తుతం కొత్త వెబ్ సిరీసులు చర్చల దశలో ఉన్నాయి. ‘ఫ్యామిలీమేన్ 3’ గురించి ఎలాంటి డిస్కషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగలేదు. టీవీ షోస్ కూడా చేస్తున్నా. అందరూ అనుకున్నట్టు అవేమీ స్క్రిప్టెడ్ కాదు. అందరం డిస్కస్ చేసుకుని, ఎవరి సెంటిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీ హర్ట్ చేయకుండా నిర్ణయాలు తీసుకుంటామంతే. నారప్ప, విరాటపర్వం త్వరలో రిలీజ్ కానున్నాయి.  మూడు ప్యాన్ ఇండియా సినిమాలు చేతిలో ఉన్నాయి. వచ్చే నెల నుండి షూట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాయినౌతా. ‘మైదాన్’లో నా పోర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంప్లీట్ చేసేశాను. నా  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతృప్తికరంగానే ఉంది.’’