డ్రగ్స్ కేసులో కేటీఆర్ పాత్ర.. గోవా టూర్‎‎పై ఆరా తీయాలి

డ్రగ్స్ కేసులో కేటీఆర్ పాత్ర.. గోవా టూర్‎‎పై ఆరా తీయాలి

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో రాజకీయ నేతల ప్రమేయముందని ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్ అన్నారు. ఈ విషయం గురించి అధికారులకు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు. ‘దిశ కేసు, సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి లాంటి ఘటనలు మద్యం, గంజాయి మత్తులో జరిగాయి. ఈడీ అధికారులు త్వరలోనే మా ఫిర్యాదుపై విచారణ చేస్తామన్నారు. డ్రగ్స్ కేసు 2017లోనే కొలిక్కి వచ్చేది. అప్పట్లో ఆ కేసును కేటీఆర్ ప్రభావితం చేశారు. సినీ హీరోయిన్‎లతో కేటీఆర్‎కు సంబంధాలున్నాయని మా ఫిర్యాదులో కొన్ని ఆధారాలను కూడా జత చేశాం. కేటీఆర్ రహస్యంగా గోవా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆ ట్రిప్ అఫిషీయల్ ట్రిప్ లేక ప్రైవేట్ ట్రిప్? డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన టాలీవుడ్ నటులతో కేటీఆర్‎కు మంచి సంబంధాలున్నాయి. ఎక్సైజ్ కేసును క్లోస్ చేసినట్టే.. ఈడీ కేసులో పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. సినీ ప్రముఖులను విచారణ చేసినట్టే రాజకీయ నాయకులను కూడా విచారణ చేయాలి’ అని జడ్సన్ అన్నారు.