
ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్లెంట్ వైఫ్.. అంటూ ఈ సారి ఎక్స్టార్డినరీ ట్రాంగులర్ క్రైం థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విక్టరీ వెంకీ. డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టనున్న వెంకీ మామ..ఎంటర్టైన్మెంట్ లెవల్ పీక్స్ ఉండేలా సిద్ధమయ్యారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ (SVC 58) నుంచి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇపుడు ఈ సినిమాలో వెంకీ సరసన నటించబోయే బ్యూటీఫుల్ లేడీస్ ఎవరనేది ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో బ్యూటీ మీనాక్షి చౌదరిని ఎంపిక చేయగా..మరో హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు అన్నౌన్స్ చేశారు.
తాజాగా SVC 58లో టాలెంటెడ్ యాక్టర్ ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.‘యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేశ్, ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. జులై 3 నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం. నవంబరులో పూర్తిచేసి.. 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం’ అని అనిల్ రావిపూడి చెప్పారు.
Welcoming on board, the talented @aishu_dil as the EXcellent Wife in #VenkyAnil3 ❤️
— Anil Ravipudi (@AnilRavipudi) July 2, 2024
Victory @VenkyMama #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna @SVC_official #SVC58 pic.twitter.com/YQy5RlmMDp
ఈ న్యూస్ తెలుసుకున్న విక్టరీ ఫ్యాన్స్ 'ప్రియురాలితో రొమాన్స్..భార్యతో పటాస్' అంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు సినిమాను కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో వెంకీ భార్యగా కనిపించే ఐశ్వర్య చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు. కౌసల్య కృష్ణ మూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ సినిమాల్లో ఐశ్వర్య నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.