
అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. జూన్ 6న అక్కినేని అఖిల్ పెళ్లి జరగనుందని ఫిల్మ్ నగర్ సర్క్సిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ 6న పెళ్లి, జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్లో రిసెప్షన్ ఉండనుందని టాక్. గతేడాది నవంబర్లో జైనాబ్ రవ్జీ, అఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ ప్రేమించుకుని పెళ్లి పీటలెక్కబోతున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో ఈ ప్రేమ జంట వైవాహిక బంధం వైపు అడుగులేసింది.
నాగార్జునకు, జైనాబ్ రవ్జీ తండ్రి జుల్ఫీ రవ్జీ ఫ్రెండ్ కావడంతో ఈ ప్రేమ జంటకు మార్గం సుగమమైంది. ఆమె తండ్రి వ్యాపారవేత్త కావడంతో దుబాయ్, లండన్, ఇండియా.. ఇలా మన దేశంలో పాటు పలు దేశాల్లో ఆమె తన జీవితాన్ని గడిపింది. జైనాబ్ రవ్జీ ఫ్యామిలీకి బంజారాహిల్స్ రోడ్ నంబర్.7లో సొంత ఇల్లు కూడా ఉంది. జైనాబ్ రవ్జీ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిట్ట అని తెలిసింది. అఖిల్, జైనాబ్ రవ్జీ నిశ్చితార్థం 2024 నవంబర్లో జరిగింది.
అఖిల్కు, ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్ నిశ్చితార్థం జరిగినప్పటికీ పెళ్లి రద్దైంది. ఆ తర్వాత శ్రేయా భూపాల్ మరొకరిని వివాహం చేసుకుంది. పెళ్లి రద్దు చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత అఖిల్ పెళ్లి పీటలెక్కనుండటంతో అక్కినేని కుటుంబంలో కోలాహలం కనిపించింది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4, 2024న అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.