
బోధన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లీడర్లు రోజుకో పార్టీ మారుతున్నారు. బోధన్ టౌన్‌లోని 18వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ లీడర్ సాకేత్వర్మ ఆదివారం మున్సిపల్‌చైర్ పర్సన్ తూము పద్మావతి భర్త శరత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రోజు గడవకముందే సోమవారం తిరిగి బోధన్ ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.