నా సంతోషం నువ్వే.. అర్హ బర్త్డేకు బన్నీస్పెషల్ విషెష్

నా సంతోషం నువ్వే.. అర్హ బర్త్డేకు బన్నీస్పెషల్ విషెష్

అల్లు అర్హ (Allu Arha).. ముద్దు ముద్దు మాటలు, అల్లరి చేష్టలతో ఇప్పటికే సోషల్​ మీడియాలో బోలెడంతమంది ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సంపాదించుకుంది. ఇవాళ అల్లు అర్జున్(Allu Arjun)కూతురు అల్లు అర్హ బర్త్డే సందర్బంగా స్పెషల్ పోస్ట్ చేశారు ఐకాన్ స్టార్. నా అంతులేని సంతోషానికి కారణమైన నీకు బర్త్డే విషెస్..అంటూ ట్వీట్ చేశారు.

పనిలో పని మెల్లగా నాన్న గదికి పోయి పాస్‌పోర్ట్ వెతికి చింపేయ్ వా మాకోసం. ఎలాగూ ఇవాళ నీ బర్త్ డే కదా..బన్నీ కూడా ఏం అనడు నిన్ను..అంటూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అల్లు అర్హ..అల్లు అర్జున్ స్పెషల్ బాండింగ్ ఎలా ఉంటుందో ఇదివరకే రిలీజైన వీడియోస్ లో చూస్తూనే ఉన్నాం. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్లో అల్లు అర్హకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బాగానే వైరల్ అవుతుంటాయి. ఇక ఈ తండ్రీకూతుళ్ల సంభాషణలు అయితే జనాలను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ ఇద్దరూ కలిసి చేసే అల్లరి అంతఇంత కాదు. అల్లు ఫ్యాన్స్ తో పాటు ప్రతిఒక్కరిని మెస్మరైజ్ చేస్తాయి.

అంతేకాకుండా తండ్రిని ముద్దుగా..రా అని కూడా పిలిచేస్తుంటుంది అర్హ. తన కూతురితో బన్నీ ఆడుకుంటూ , ఆట పట్టిస్తూ ఉండే వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు. ఈ ఇద్దరికీ సంబంధించిన దోశ స్టెప్పులు, దొండకాయ బెండకాయ అంటూ ముద్దు ముద్దుగా అర్హ చెప్పిన మాటలను..బన్నీసోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. 

సమంత నటించిన శాకుంతలం సినిమాలో చిన్నప్పటి భరతుడిగా కనిపించి ఆడియన్స్ ను మెస్పరైజ్ చేసింది అల్లు అర్హ. ఈ సినిమాలో అర్హ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో కూడా స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తోంది.  కేవలం పది నిమిషాల పాత్ర కోసం అర్హకు రూ.20 లక్షలు కూడా ఇస్తున్నట్లు సమాచారం.