అమెజాన్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తుంది.. 50-80% డిస్కౌంట్ ధరకే.. కొన్నోళ్లకి కొన్నంత...

అమెజాన్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తుంది.. 50-80% డిస్కౌంట్ ధరకే.. కొన్నోళ్లకి కొన్నంత...

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షాపింగ్ ప్రియుల అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 మళ్ళీ వచ్చేస్తుంది. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా  ప్రైమ్ మెంబర్స్ అన్ని ఆఫర్స్  24 గంటల ముందుగానే పొందోచ్చు. కానీ ఈ సేల్ ఎప్పటినుంచి అనేది ఇంకా వెల్లడికానప్పటికీ, అమెజాన్ అందిస్తున్న  అన్ని డీల్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్ గురించి ముందే చెబుతూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

 డీల్స్ అండ్ బ్యాంక్ ఆఫర్లు: అమెజాన్ కస్టమర్లు SBI డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించి క్రెడిట్ కార్డ్ EMIతో సహా 10% ఇన్స్టంట్ డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇంకా   స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు  ఇతర వాటిపై  భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. అలాగే ఫ్యాషన్, బ్యూటీ, హోమ్, కిచెన్ ఉత్పత్తులపై  50% నుండి 80% వరకు మీరు ఊహించని ఆఫర్స్  ఇస్తుంది. 

ALSO READ : గూగుల్ మీ గురించి ఏం తెలుసుకుందో చూశారా ?

ఎలక్ట్రానిక్స్ & ఆక్సెసొరిస్ : వీటిలో AMD Ryzen 5 7520Uతో ASUS Vivobook Go 14, AMD Ryzen 7 7730Uతో  డెల్ న్యూ 15, NVIDIA GeForce RTX 3050తో ASUS TUF గేమింగ్ A15, NVIDIA RTX 4060 గ్రాఫిక్స్‌తో HP స్మార్ట్‌చాయిస్ ఒమెన్ వంటి ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. ఇంకా Sony BRAVIA K-55S25B, LG UA82 సిరీస్ వంటి స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి.  

ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 దాదాపు ప్రతి షాపింగ్ కేటగిరీని కవర్ చేస్తుందని, ఈ ఏడాది  అమెజాన్  అతిపెద్ద ఈవెంట్‌లలో ఇదో కూడా ఒకటి అవుతుందని కంపెనీ హామీ ఇస్తుంది. కేవలం షాపింగ్ ఒక్కటే కాకుండా ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా విమానాలు, హోటళ్ళు ఇంకా బస్సు టికెట్ బుకింగ్‌లపై 65 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది.