గూగుల్ మీ గురించి ఏం తెలుసుకుందో చూశారా ? మీ బ్రౌసింగ్ హిస్టరీ పూర్తిగా డిలేట్ చేయడం ఎలా అంటే ?

గూగుల్ మీ గురించి ఏం తెలుసుకుందో చూశారా ? మీ బ్రౌసింగ్ హిస్టరీ పూర్తిగా డిలేట్ చేయడం ఎలా అంటే ?

చాలా మంది క్రోమ్ హిస్టరీ డిలేట్ చేయడం అంటే హిస్టరీలోకి వెళ్లి క్లియర్ బ్రౌజింగ్ హిస్టరీ అని క్లిక్ చేస్తే అయిపోతుందని అనుకుంటారు.... ఇలా అనుకుంటే పొరపాటు పడ్డట్లే... ఎందుకంటే అది మీ లోకల్ హిస్టరీని మాత్రమే క్లియర్ చేస్తుంది. నిజం చెప్పాలంటే మీరు ఆన్‌లైన్లో బ్రౌజ్ చేసింది అంత అలాగే ఉంటుంది, అది కూడా  మీ Google అకౌంట్లో స్టోర్ అవుతుంది. 

మీరు సెర్చ్ చేసింది, క్లిక్‌ చేసింది..  హిస్టరీ రికార్డ్ ఇప్పటికీ మీ Google అకౌంట్లో అలాగే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అనుకున్నట్లు క్రోమ్ హిస్టరీ నిజంగా డిలేట్ కాలేదు. మీరు చేసిన ప్రతి సెర్చ్, చూసిన వీడియో లేదా  తెరిచిన సైట్ అంత స్టోర్ అవుతుంది. మీరు బ్రౌజ్ చేసింది నిజంగా మొత్తం డిలేట్ చేయాలనుకుంటే  మీరు బ్రౌజర్‌ తో పాటు  మీ Google అకౌంట్ సెట్టింగ్‌లు కూడా  మార్చాలి. 

ALSO READ : నిమిషాల్లో డబ్బు డబుల్ చేసిన ఐపీవో..

 గూగుల్ సెర్చ్ ఎందుకు డిలేట్ చేయాలి :
ప్రైవసీ: మీరు సెర్చ్ చేసేది...  మీ గురించి, మీ ఇష్టాలు, మీ ఆరోగ్యం, ఆర్థిక విషయాలు అలాగే కొన్ని రహస్యాల గురించి కూడా బయటికి చెబుతాయి.
ట్రాకింగ్: మీ సెర్చ్ హిస్టరీ డిలేట్ చేయడం అంటే మీ Google అకౌంటుకు సంబంధించి ట్రాకింగ్ తగ్గుతుంది. 
సేఫ్  సెర్చ్: ఇబ్బందికరమైన లేదా సున్నితమైన విషయాల సెర్చ్ మిమ్మల్ని వెంటాడుతుందని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


మీ Google సెర్చ్ ఎలా పూర్తిగా డిలేట్ చేయాలి: 
*మొదట గూగుల్ లో myactivity.google.comకి వెళ్లండి
*పైన ఉన్న Delete activity by అప్షన్  పై క్లిక్ చేయండి
*డిలేట్ All Time పై క్లిక్ చేసి 
* Next పై నొక్కండి  
*అంతే, మీ అకౌంట్  సంబంధించిన సెర్చ్,బ్రౌసింగ్ హిస్టరీ డిలేట్ అయిపోతుంది. 

సేఫ్ సెర్చ్ కోసం :
యాక్టివిటీ ట్రాకింగ్‌ ఆఫ్ చేయండి: మీ అకౌంట్లో వెబ్ & యాప్ యాక్టివిటీ, లొకేషన్ హిస్టరీ, YouTube హిస్టరీ డిజేబుల్ చేయండి.
ప్రైవసీ టూల్స్  : VPN మీ IP అడ్రస్ దాచిపెడుతుంది.
ప్రైవేట్ సెర్చ్ ఇంజన్లు : DuckDuckGo, Startpage, లేదా Brave Search.
హిస్టరీ ఆటోమాటిక్  డిలేట్ : మీరు బ్రౌసర్ exit అయినపుడు బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేసేల Chrome సెటింగ్ మార్చుకోండి. 

కాబట్టి ఎప్పుడైన మీరు Chrome హిస్టరీని కేవలం మూడు చుక్కలపై క్లిక్ చేసి క్లియర్ చేసినప్పుడు, అది పూర్తి డిలేట్ కాదని గుర్తుంచుకోండి. దీనికోసం  myactivity  నుండి డిలేట్ చేస్తే తప్ప మీ ఆన్‌లైన్ బ్రౌసింగ్ హిస్టరీ ట్రాకింగ్ మీ Google అకౌంట్లో అలాగే ఉంటుంది.