మా ప్రాంతాన్ని మేం స్వాధీనం చేసుకున్నం: ఏపీ మంత్రి అంబటి రాంబాబు

మా ప్రాంతాన్ని మేం స్వాధీనం చేసుకున్నం: ఏపీ మంత్రి అంబటి రాంబాబు
  • మా ప్రాంతాన్ని మేం స్వాధీనం చేసుకున్నం
  • దానికి దండయాత్ర అంటే ఎలా?
  • ఏపీ వైపు కూడా తెలంగాణ పోలీసులా?
  • మాది కాని ఒక్క నీటి బొట్టూ మాకు వద్దు
  • ఈ గొడవకు చంద్రబాబే కారణం
  • మాకు తెలంగాణలో రాజకీయ ఇంట్రెస్టుల్లేవ్
  • ఏపీ మంత్రి అంబటి రాంబాబు

అమరావతి: ‘ మా ప్రాంతాన్ని మేం స్వాధీనం చేసుకున్న.. ఏపీ వైపు కూడా తెలంగాణ  పోలీసులే  ఉండాలా..? ధర్మంగా మా స్థలాన్ని మేంద ఆధీనంలోకి తీసుకుంటే దానికి దండయాత్ర అంటే ఎలా..?’అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు  ప్రశ్నించారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ లో 13 వ గేటు వరకు తమదేనని అన్నారు. అక్కడి వరకు ఏపీ పపోలీసులు, అధికారులు వెళ్లేందుకు తెలంగాణ అనుమతి తీసుకోవాలా..? అని ప్రశ్నించారు. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్న అంబటి.. తెలంగాణలో తమకు ఎలాంటి రాజకీయ ఇంట్రెస్టులు లేవని చెప్పారు.

తాము అక్కడ ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం లేదని చెప్పారు. తెలంగాణ  పోలింగ్ రోజున ఒక పార్టీకి లబ్ధి కలిగేలా చేయాల్సిన ఖర్మ తమకు పట్టలేదని చెప్పారు. తమదైన సాగర్ కుడి కాల్వను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం అన్యాయమని అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీకి రావాల్సిన ఒక్క నీటి బొట్టునూ వదులుకునే  ప్రసక్తే లేదన్నారు. ఇంత ఇష్యూ కావడానికి కారణం మాజీ సీఎం చంద్రబాబు  నాయుడని విమర్శించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏపీ హక్కులు వదులుకున్నారని, తెలంగాణకు భయపడి పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.