స్వాతంత్ర్యం రాకముందు వేసిన పెయింటింగ్ కి 37కోట్లు

V6 Velugu Posted on Jul 15, 2021

శాఫ్రాన్ ఆర్ట్ సంస్థ ఇటీవల రెండు అపురూప పెయింటింగ్స్ ను వేలం వేసింది. ఆ రెండు చిత్రాల్లో ఒకటి ప్రముఖ భారత పెయింటర్ అమృతా షేర్ గిల్ గీసింది కాగా.. మరొకటి వీఎస్ గైటోండే అనే కళాకారుడికి చెందిన చిత్రం. గైటోండే వేసిన పెయింటింగ్ కు అత్యధికంగా వేలంలో రూ.39.98 కోట్ల ధర పలకగా.. దివంగత చిత్రకారిణి అమృతా షేర్ గిల్ చిత్రం 'ఇన్ ద లేడీస్ ఎన్ క్లోజర్' రూ.37.8 కోట్లకు అమ్ముడుపోయింది. 

అమృత ఈ పెయింటింగ్ ను దేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1938లో వేశారు. ఈ చిత్రంలో కొందరు మహిళలు రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండడాన్ని చూడొచ్చు. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆమె గోరఖ్ పూర్ లోని తమ ఎస్టేట్ లో ఉంటూ ఈ అపురూప కళాఖండాన్ని తీర్చిదిద్దారు.

Tagged Amrita Sher Gil, 1938year painting, fetches Rs 37.8 cr, Indian artist

Latest Videos

Subscribe Now

More News