హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం

గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్లాండ్కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. బాధితురాలు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి.. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న యూనివర్సిటీ విద్యార్థులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ రవిరంజన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.