
అక్టోబర్‌లోనే ‘ఆర్ఆర్ఆర్’ వస్తోందంటూ ఊరిస్తున్న రాజమౌళి, ప్రమోషన్స్ విషయంలోనూ అంతే స్పీడు చూపిస్తున్నారు. ఇటీవల మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు. ఓవైపు ప్రమోషనల్ కంటెంట్‌పై దృష్టి పెడుతున్నారు. మరోవైపు వీఎఫ్ఎక్స్ వర్క్‌ని జెట్ స్పీడుతో కంప్లీట్ చేస్తున్నారు. ఇంకోవైపు మ్యూజిక్ వర్క్‌ని కీరవాణి పరుగులెత్తిస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది చేత ఓ పాట పాడించిన ఆయన, తాజాగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలిసి పని చేశారు. తనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్న కీరవాణి.. ఎనర్జీ, టాలెంట్‌తో పాటు మంచి టీమ్ అనిరుధ్‌కి మెయిన్ ఎసెట్స్ అని, అన్నిటికంటే మించి అంత వినయంగా ఉండటం తన గొప్పతనమని మెచ్చుకున్నారు. ఈ సినిమా కోసం అనిరుధ్ ఓ ప్రమోషనల్ సాంగ్ కంపోజ్ చేస్తున్నా డని కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అది నిజమేనని ఇప్పటికి క్లారిటీ వచ్చింది. అయితే అన్ని భాషల్లోనూ విడివిడిగా ఈ సాంగ్‌ని కంపోజ్ చేస్తున్నా రట. ఆ లెక్కన అనిరుధ్ సాంగ్ కేవలం తమిళ వెర్షన్‌లోనే ఉండబోతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ అంతా ఈ పాటలో కనిపించనున్నారట. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాల్లో నటించిన హీరోలందరూ కూడా కనిపిస్తారని టాక్. ఆగస్ట్ 1న ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ పాటని విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ ఆడియో రైట్స్‌ని టీ సిరీస్, లహరి సంస్థలు దక్కించుకున్నాయి.