
అమెరికన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఆపిల్ చివరికి ఐఫోన్ 17 ఎయిర్ ని లాంచ్ చేసేసింది. ఈ సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ కొత్త ఐఫోన్ మోడళ్లతో ఐఫోన్ 17 ఎయిర్ ఇప్పటివరకు ఉన్న అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అని, అది కూడా కేవలం 5.5mmతో ఇంత సన్నగా తయారు చేయడానికి ఫోన్ మొత్తం కొత్తగా రిడిజైన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
ఇండియాలో ఐఫోన్ 17 ఎయిర్ ధర చూస్తే : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర 256GB బేస్ స్టోరేజ్ వేరియంట్ రూ. 1,19,900 నుండి ప్రారంభమవుతుంది, అయితే 512GB ధర రూ. 1,39,900, 1TB ధర రూ.1,59,900. ఐఫోన్ 17 ధర రూ. 82,900 నుండి, ఐఫోన్ 17 ప్రో మోడల్ ధర రూ.1,34,900 నుండి స్టార్ట్ అవుతాయి. ఐఫోన్ 17 మోడళ్లతో పాటు ఐఫోన్ ఎయిర్ ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 12న సాయంత్రం 5.30 గంటలకు నుండి ప్రారంభమవుతాయి, సెప్టెంబర్ 19న సేల్స్ ఉంటాయి. స్కై బ్లూ, లైట్ గోల్డ్, స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్ వంటి కలర్ అప్షన్స్ కూడా ఉన్నాయి.
ఐఫోన్ 17 ఎయిర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు: ఐఫోన్ ఎయిర్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల OLED డిస్‌ప్లే, 5.5mm స్లిమ్, అల్యూమినియం ఫ్రేమ్, కొత్త ఫైవ్-కోర్ A19 ప్రో చిప్, 8GB RAM, మల్టీ టాస్కింగ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే f/1.6 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 2X టెలిఫోటో కెపాసిటీతో సింగిల్ 48-మెగాపిక్సెల్ ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీ కోసం 18-మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఉంటుంది. Wi-Fi 7, బ్లూటూత్ 6, కొత్త C1X మోడెమ్‌తో పాటు iPhone 16e C1 మోడెమ్ కంటే డబుల్ నెట్‌వర్కింగ్ స్పీడ్ అందిస్తుంది.
ఐఫోన్ ఎయిర్ బ్యాటరీ చూస్తే 2,900mAh, అయితే ఇది ఐఫోన్ 16 ప్లస్‌లో ఉన్న 4,674mAh బ్యాటరీ కంటే చిన్నది, కానీ ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 165 గ్రాముల బరువుతో 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌తో రోజంతా బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ iOS 26పై నడుస్తుంది, లేటెస్ట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకా దుమ్ము, వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్ పొందింది. ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్‌లో అడాప్టివ్ పవర్ మోడ్ ఇంటిగ్రేట్ చేసింది, అంటే మీ బ్యాటరీ ఎంతసేపట్లో అయిపోతుందో చూపిస్తుంది.