దసరాకి కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా..? అమెజాన్లో అతితక్కువ ధరకే.. అఫర్ మిస్సవకండి..

దసరాకి కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా..? అమెజాన్లో అతితక్కువ ధరకే.. అఫర్ మిస్సవకండి..

అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తుంది. ఈసారి ఐఫోన్ లవర్స్ ని కూడా ఆకట్టుకునేందుకు బెస్ట్ ఆఫర్స్ తీసుకొస్తుంది. వీటిలో ప్రస్తుతం రూ.59,990కి అమ్ముడవుతున్న ఆపిల్ ఐఫోన్ 15 అదిరిపోయే  డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ కింద రూ.45 వేల కంటే తక్కువ ధరకే  లభిస్తుంది.

కొత్త కొత్త ఆఫర్లతో పాటు అమెజాన్ సేల్ సమయంలో ఐఫోన్ 15పై రూ.36,151 డిస్కౌంట్ అందిస్తుంది, దీని లాంచ్ ధర రూ. 79వేలు. అంటే 50% కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ భారీ  తగ్గింపు ఆపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో విడుదలైనప్పటి నుండి అత్యంత భారీ తగ్గింపులో ఒకటి. ఈ పండుగ సీజన్‌లో  సేల్స్ పెంచడానికి ఐఫోన్ 15ని అతితక్కువ ధరకే అందిస్తుంది. 

ALSO READ : చవకగా మారుతీ కార్లు: రూ.3లక్షల 69 వేలకే Alto కారు..

ముఖ్యంగా SBI క్రెడిట్, డెబిట్ కార్డ్లపై  ఎక్స్ట్రా సేవింగ్స్ కూడా ఉన్నాయి. SBI కార్డ్ ఉన్నవారు Amazonలో రూ. 6వేలు లేదా అంతకంటే ఎక్కువే, అదనంగా 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు పొందవచ్చు, దింతో ఐఫోన్ 15 ధర మరింత తగ్గుతుంది.

అంతేకాదు అమెజాన్ ఎక్స్ఛేంజ్ డీల్స్, నో-కాస్ట్ EMI అప్షన్స్ కూడా అందిస్తోంది. దీని వల్ల ధర ఎక్కువ అని ఆలోచించే కస్టమర్లు ఇంకా కొనేందుకు మంచి ఛాన్స్ కోసం చూస్తున్న వారికి  ఐఫోన్ కొనేందుకు ఇదొక బెస్ట్ ఛాన్స్. 

అయితే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది, ప్రైమ్ యూజర్లకి ఆఫర్స్ ఒకరోజు  ముందుగానే యాక్సెస్ ఉంటుంది. ఈ సేల్ దీపావళి సీజన్ అంతా కొనసాగుతుందని, ఈ ప్రమోషనల్ ధరలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రజలకు మంచి అవకాశం ఇస్తుందని భావిస్తున్నారు.