డ్రగ్‌ కేసులో తల్లి పుట్టిన రోజున జైలుకు ఆర్యన్‌ ఖాన్‌

డ్రగ్‌ కేసులో తల్లి పుట్టిన రోజున జైలుకు ఆర్యన్‌ ఖాన్‌

డ్రగ్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ తిరస్కరించడంతో అతనితో పాటు మిగిలిన ఇద్దరు నిందితులను ఆర్థర్‌ రోడ్‌ జైలుకు తరలించారు. అయితే ఈరాత్రికి వీరు జైలులో ఉండకపోవచ్చు. వీరిని కరోనా పరీక్షల కోసం డాక్టర్ల దగ్గరకు తీస్కెళతారు. ఆ తర్వాత క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ తర్వాత జైలుకు తీసుకు వస్తారు. అయితే రికార్డు పరంగా ఆర్యన్‌ ఖాన్‌కు ఇది జైలులో మొదటి రోజు. ఇవాళ ఆర్యన్‌ ఖాన్‌ తల్లి గౌరి ఖాన్‌ పుట్టిన రోజు కూడా.

ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మెర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచలకు ముంబై సిటీ కోర్టు బెయిల్‌ తిరస్కరించింది. ఈ ముగ్గురూ బెయిల్‌ కోసం సెషన్స్‌ కోర్టుకు వెళ్లొచ్చని న్యాయమూర్తి సూచించారు. రేపు(శనివారం) నిందితులు ముగ్గురు బెయిల్‌ కోసం సెషన్స్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు సిటీ కోర్టులో ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ కోర్టును కోరారు. బెయిల్‌పై విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని వాదించారు.