పుజారా బౌలింగ్ వేస్తే నేనేం చేయాలి..? : అశ్విన్

పుజారా బౌలింగ్ వేస్తే నేనేం చేయాలి..? : అశ్విన్

అహ్మదాబాద్ టెస్టు చివరి రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయోగాలు చేశాడు. బ్యాట్స్మన్ పుజారా, శుభ్ మన్ గిల్ చేత బౌలింగ్ వేయించాడు. గిల్ 77వ ఓవర్ వేయగా..78వ ఓవర్ను పుజారా చేత చేయించాడు. 

ఒకే పరుగు ఇచ్చారు..

ఒక ఓవర్ వేసిన పుజారా ఒకటే రన్ ఇచ్చాడు. అటు శుభ్ మన్  గిల్ సైతం ఒకేఒక్క పరుగు ఇచ్చాడు. పుజారా బౌలింగ్ చేయడంపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫన్నీగా స్పందించాడు.

అశ్విన్ కామెంట్... పుజారా రిప్లై 

పుజారా బౌలింగ్ చేస్తున్న ఫోటోను  అశ్విన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా నువ్వు బౌలింగ్ వేస్తే ..నేనేం చెయ్యాలి..?  బౌలింగ్ వేయడం మానేయాలా..? అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. అశ్విన్ ఫన్నీ కామెంట్పై పుజారా రీట్వీట్ చేశాడు. లేదు...ఇది నాగ్ పూర్లో వన్ డౌన్లో వెళ్లినందుకు ధన్యవాదాలు చెప్పడానికి మాత్రమే వేశానని పుజారా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.