IND vs NZ: ఒక్కడే వీర ఉతుడుకు: 35 బంతుల్లోనే 84 పరుగులు.. న్యూజిలాండ్‌పై అభిషేక్ విశ్వరూపం

IND vs NZ: ఒక్కడే వీర ఉతుడుకు: 35 బంతుల్లోనే 84 పరుగులు.. న్యూజిలాండ్‌పై అభిషేక్ విశ్వరూపం

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో విధ్వంసం సృష్టించాడు. నాగ్ పూర్ వేదికగా బుధవారం (జనవరి 21) విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఎప్పటి లాగే ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ములేపాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆటాడుకున్నాడు. కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లతో పాటు 8 సిక్సర్లున్నాయి. 

ఈ మ్యాచ్ లో ఇండియా 27 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సంజు శాంసన్ (10), ఇషాన్ కిషాన్ (8) త్వరగానే పెవిలియన్ కు చేరారు. ఒక ఎండ్ లో రెండు వికెట్లు పడినా అభిషేక్ మాత్రం తన విధ్వంసం ఆపలేదు. వరుస పెట్టి బౌండరీల మోత మోగిస్తూ స్టేడియాన్ని హోరెత్తించాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ యువ ఓపెనర్.. ఆ తర్వాత మరింతల రెచ్చిపోయి ఆడాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 12 బంతుల్లోనే 35 పరుగులు రాబట్టాడు. 11 ఓవర్లో ఫోర్, రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఇదే ఓవర్లో ఒక భారీ షాట్ కొట్టి ఔట్ కావడంతో అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది. 

►ALSO READ | ICC ODI rankings: సెంచరీ చేసినా రెండో ర్యాంక్‌కు పడిపోయిన కోహ్లీ.. కారణమిదే!

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియా 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. క్రీజ్ లో హార్దిక్ పాండ్య (12) ఉన్నాడు. అభిషేక్ శర్మ 85 పరుగులు చేసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభము ఇచ్చాడు. సూర్య 32 పరుగులు చేసి రాణించాడు. సంజు శాంసన్ (10) ఇషాన్ కిషన్ (8) విఫలమయ్యారు.