ఐసీసీ బుధవారం (జనవరి 21) ప్రకటించిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్.. కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానికి దూసుకొచ్చాడు. దీంతో కోహ్లీ నెంబర్ వన్ ర్యాంక్ ఒక్క వారానికే పరిమితమైంది. గత వారంలో ఐసీసీ బుధవారం (జనవరి 14) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో కోహ్లీ నెంబర్ వన్ స్థానానికి దూసుకొచ్చాడు. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కోహ్లీ కంటే కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే వెనకపడి ఉన్నాడు.
ఇప్పటి వరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్న మన విరాట్ కోహ్లీ ఇప్పుడు నెంబర్ 2కు పడిపోయాడు. నెంబర్ వన్ ప్లేసులో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ నిలిచాడు. డారిల్ మిచెన్ 845 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చాడు. మన కోహ్లీ 795 పాయింట్లతో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. మిచెల్, కోహ్లీ మధ్య 50 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. కోహ్లీ చివరి వన్డేలో సెంచరీ చేసినా రెండో ర్యాంక్ కు పడిపోవడంతో ఫ్యాన్స్ కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. సెంచరీ చేసినా కోహ్లీ టాప్ ర్యాంక్ కోల్పోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
రెండు మ్యాచ్ ల్లో మిచెల్ సెంచరీలు:
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డేకు ముందు ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకటించింది. బుధవారం (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో కోహ్లీ విఫలం కాగా.. మరోవైపు మిచెల్ సెంచరీతో సత్తా చాటాడు. రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. కివీస్ స్టార్ మిచెల్ మాత్రం ఏకంగా 131 పరుగులతో చెలరేగాడు. ఇక మూడో వన్డేలో చూసుకుంటే మిచెల్ తో పాటు కోహ్లీ కూడా సెంచరీతో చెలరేగాడు. మిచెల్ 137 పరుగులతో సత్తా చాటితే.. కోహ్లీ 124 పరుగులు చేసి వన్డే కెరీర్ లో 54 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండు మ్యాచ్ ల్లో చూసుకుంటే మిచెల్ 268 పరుగులు చేశాడు.
మరోవైపు కోహ్లీ 146 పరుగులు చేశాడు. కోహ్లీ కంటే మిచెల్ 122 పరుగులు ఎక్కువ చేశాడు. వీరిద్దరి మధ్య ఒకటే రేటింగ్ పాయింట్ తేడా ఉంది. దీంతో ఐసీసీ అప్ డేట్ చేసిన తాజాగా ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టి మిచెల్ అగ్రస్థానానికి వచ్చాడు. రెండు జట్లు త్వరలో వన్డే సిరీస్ ఆడడం లేదు. కోహ్లీ బాగా ఆడి సెంచరీ చేసినా మిచెల్ అంతకంటే బాగా ఆడడంతో ఈ కివీస్ వీరుడు టాప్ ర్యాంక్ కు చేరుకున్నాడు. ఇండియాలో మిచెల్ చివరిసారిగా ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. ఇండియాలో ఈ కివీస్ వీరుడు వరుసగా 130, 134, 84,131, 137 పరుగులు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్ ల్లో యావరేజ్ తో 616 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
