యాక్సిడెంట్లో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

యాక్సిడెంట్లో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

ఆసిఫాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. రెబ్బెన పోలీస్ స్టేషన్‌‌లో పనిచేస్తున్న జాడి బాపురావు(59) సోమవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని తక్కళ్లపల్లి ఎక్స్‌‌రోడ్ చెక్‌‌పోస్ట్ నుంచి ఆసిఫాబాద్‌‌కు బైక్‌‌పై వెళ్తున్నాడు. రెబ్బెన మండలం పులికుంట గ్రామం వద్ద జాతీయ రహదారి 363పై వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాపురావు స్పాట్​లో మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు.