50 లక్షల నగదుతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ పరార్

50 లక్షల నగదుతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ పరార్
  • సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఏటీఎం వ్యాన్ తో సహా ఉడాయించిన డ్రైవర్

నెల్లూరు: ఏటీఎం సెంటర్లలో డబ్బులు పెట్టేందుకు ఉపయోగించే వ్యాన్ డ్రైవరే దొంగగా మారాడు. ఏటీఎం సెంటర్లో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెంట వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి వ్యాన్ తో సహా ఉడాయించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. మద్రాస్ బస్టాండు సెంటర్లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం సెంటర్ లో రూ.50 లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు ఆర్డర్ వచ్చింది. నగదు తీసుకున్న సెక్యూర్ వ్యాలీ క్యాష్ ఏజెన్సీ సిబ్బంది, వ్యాన్ డ్రైవర్ పోలయ్య నగదు తీసుకుని బయలుదేరారు. ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ సిబ్బంది కిందకు దిగిన వెంటనే డ్రైవర్ పోలయ్య వ్యాన్ తో సహా ఉడాయించాడు. హఠాత్ ఘటనతో ఖంగుతున్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పోలీసులకు, బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం సెక్యూరిటీ  సిబ్బంది ఫిర్యాదుతో నెల్లూరు చిన్న బజార్ పోలీసులు రంగంలోకి దిగారు.