
సంగారెడ్డి టౌన్, వెలుగు: వీరశైవ లింగాయతులు సమష్టిగా ఉంటూ సామాజికంగా ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తూ దేశ అభ్యున్నతిలో భాగస్వాములు కావాలని జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింలు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డిలోని భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో సంగారెడ్డి పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పట్టణ అధ్యక్షుడిగా ఆత్మకూర్ వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా అస్కుల సతీశ్, ఉపాధ్యక్షుడిగా మాటూరి సంతోష్, పోలీస్ శేఖర్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు. పట్టణంలో వీరశైవ లింగాయతుల అభివృద్ధికి కృషి చేస్తానని అధ్యక్షుడు వినోద్ తెలిపారు. ఏకగ్రీవంగా తన ఎన్నికకు సహకరించిన సమాజ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కొంక రాజేశ్వర్, పోలీస్ సంతోష్ కుమార్, మల్లికార్జున్, నవీన్ రామోజీ, వివిధ మండలాల పెద్దలు పాల్గొన్నారు.