కొత్త ఏడాది వేళ గుంటూరులో ఉద్రిక్తం.. వైసీపీ కార్యాలయంపై దాడి.. వాళ్లను వదిలేది లేదంటూ మంత్రి రజిని సీరియస్

కొత్త ఏడాది వేళ గుంటూరులో ఉద్రిక్తం..  వైసీపీ కార్యాలయంపై దాడి.. వాళ్లను వదిలేది లేదంటూ మంత్రి రజిని సీరియస్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో మందుబాబులు వీరంగం సృష్టించారు. విద్యా నగర్‌ రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న మంత్రి విడదల రజిని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ని నియమించారు. జనవరి 1న పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

నూతన సంవత్సరం వేళ గుంటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రమౌళి నగర్ లోని వైసీపీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని నియమితులయ్యారు.  నూతన ఏడాది పురస్కరించుకొని కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. అయితే, ఆదివారం అర్థరాత్రి (2023  డిసెంబర్​ 31)న్యూ ఇయర్ ర్యాలీలో భాగంగా అటువైపు వచ్చిన కొంతమంది యువకులు కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యానగర్‌లో మంత్రి విడదల రజిని కార్యాలయంపై ఆదివారం(2023  డిసెంబర్​ 31) రాత్రి దాడి జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం ( 2024 జనవరి 1) ఉదయం పదిన్నరకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు రజిని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్‌ సందర్భంగా టీడీపీ–-జనసేన కార్యకర్తలు ఆదివారం(2023  డిసెంబర్​ 31)  రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి రజిని కార్యాలయం మీదుగా వాహనాలు వెళుతున్న క్రమంలో వైసీపీ కార్యకర్తలతో ఘర్షణ జరిగిందని చెబుతున్నారు.

మంత్రి విడదల రజిని సీరియస్ ..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం ఇవాళ  ( 2024 జనవరి 1) ఓపెనింగ్ చేయాల్సి ఉంది.. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు కార్యాలయంపై రాళ్ల దాడిచేశారు.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి విడుదల రజని అన్నారు. సోమవారం ఉదయం ఆమె కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పక్కా ప్రణాళికతో దాడి చేయించారు.. రాళ్లు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదని అన్నారు. బీసీ మహిళ పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని తట్టుకోలేక పోతున్నారని, ఓడిపోతున్నామనే భయంతోనే టీడీపీ ఇలాంటి చర్యలకు పాల్పడిందంటూ మంత్రి విడుదల రజిని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి.. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను.. ప్రజల మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొంటానని అన్నారు. ఈ ఘటన వెనుక ఉన్నవారికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతామని మంత్రి రజిని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్ లు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, బీసీలంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుందని అన్నారు. పక్కా ప్రణాళికతో రాళ్ల దాడి చేశారు.. లాఠీచార్జ్ చేసినప్పటికీ దాడి కొనసాగించారని రజిని అన్నారు.