
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏడాది వయసున్న చిన్నారి థర్డ్ ఫ్లోర్‌పై నుంచి జారిపడి మృతి చెందింది. మాల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో ద్వారా ఈ ఘటన మంగళవారం జరిగినట్లు తెలుస్తోంది. ఓ తండ్రి తన ఫ్యామిలీతో కలిసి రాయ్‌పూర్‌లోని ఓ షాపింగ్ మాల్‌కు వచ్చాడు. మాల్‌లోని పైఫ్లోర్‌కి వెళ్లేందుకు ఎస్కలేటర్ దగ్గరకు వెళ్లాడు. ఏడాది వయసున్న చిన్నారిని ఆ తండ్రి ఎత్తుకోగా, ఐదేండ్ల వయసున్న ఇంకో కుమారుడు కూడా అతని పక్కన నిలబడి ఎస్కలేటర్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఆ బాబు ఎస్కలేటర్ ఎక్కేందుకు భయపడుతుండటంతో తండ్రి ఆ బాబు చేతులు పట్టుకొని ఎస్కలేటర్ మీదకి ఎక్కించేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో కొద్దిగా బ్యాలెన్స్ తప్పడంతో తండ్రి చేతుల్లో ఉన్న ఏడాది వయసున్న చిన్నారి థర్డ్ ఫ్లోర్ (40 ఫీట్లు) నుంచి జారి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోయాడు. వెంటనే ఆ చిన్నారిని హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.