మోడీని గొప్పనేతగా కీర్తిస్తుంటే.. కేసీఆర్ చిల్లర కామెంట్లు

మోడీని గొప్పనేతగా కీర్తిస్తుంటే.. కేసీఆర్ చిల్లర కామెంట్లు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4గంటలకు సమావేశాలు ముగియనున్నాయి. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై నేషనల్ కౌన్సిల్ లో చర్చిస్తున్నారు జాతీయ కార్యవర్గ సభ్యులు. తెలంగాణ సహా,.. దక్షిణాదిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి.. ఇక్కడి అధికార టీఆర్ఎస్ ఏ విధంగా కట్టడి చేయాలన్న దానిపై సభలో కీలకంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముగింపు సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఇక నేషనల్ కౌన్సిల్ చివరిరోజు సమావేశాల్లో పలు కీలక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు నేతలు. తెలంగాణపై కేంద్ర విధానం ఏ విధంగా ఉండబోతోంది.. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తారనే విషయాలు కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. 

నిన్నటి సమావేశంలోనే కుటుంబ పాలన, అవినీతి సర్కార్ ను ప్రజలు క్షమించరన్నారు జేపీ నడ్డా. రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరటంలేదన్నారు. జనం బీజేపీ వైపు చూస్తున్నారని.. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎప్పటికీ అధికారం తమదేననే భ్రమలో ఉంటున్నారని కేసీఆర్ పై విమర్శలు చేశారు నడ్డా. మరోవైపు ప్రధాని మోడీని సేల్స్ మెన్ అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. ప్రపంచం మొత్తం   మోడీని గొప్పనేతగా కీర్తిస్తుంటే.. కేసీఆర్ చిల్లర కామెంట్లు చేస్తున్నారని చెప్పారు సంజయ్. కరోనా టైమ్ లో ఇదే సేల్స్ మెన్ ఇచ్చిన వ్యాక్సిన్, మెడికల్ కిట్లను మీరు వాడుకున్నారని, కేంద్రం అందించిన సాయం తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న కేసీఆరే అసలైన సేల్స్ మెన్ అంటూ మండిపడ్డారు బండి సంజయ్.