- సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
ములుగు, వెలుగు: మేడారం జాతర సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటకు మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
ఈనెల 18,19న మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నేపథంలో ఏర్పాట్లపై చర్చించనున్నారు. కలెక్టర్దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. మహాజాతర సమీపిస్తుండగా భారీగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
