ప్రభుత్వ ఉద్యోగుల కుల వివరాలపై బీసీ కమిషన్ చర్చ

ప్రభుత్వ ఉద్యోగుల  కుల వివరాలపై బీసీ కమిషన్ చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల కుల వివరాలపై బీసీ కమిషన్ చర్చించింది. సోమవారం ఖైరతాబాద్​లోని రాష్ట్ర బీసీ కమిషన్ ఆఫీసులో చైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, మెంబర్ సెక్రటరీ బాల మాయాదేవి పాల్గొన్నారు. 

కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని సీడ్ పథకానికి అర్హులకు కావాల్సిన డీఎన్జీ సర్టిఫికెట్ జారీ విధివిధానాలపై చర్చించారు. దీనిపై త్వరలోనే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లుగా నిరంజన్​ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల కుల వివరాలను మరో 10 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థుల వివరాల సేకరణ కూడా వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.