Beauty Tips: ఆలివ్ ఆయిల్ తో వంటే కాదు.. అందం కూడా అదిరిద్ది..!

Beauty Tips:   ఆలివ్ ఆయిల్ తో వంటే కాదు..  అందం  కూడా అదిరిద్ది..!

ఆలివ్ ఆయిల్ వంటలకే కాదు... చర్మసౌందర్యాన్ని పెంచుతుంది. ఈ ఆయిలు వంటలకే పరిమితం చేయకుండా... ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా చనిపోతున్న చర్మ కణాల రక్షణ కోసం ఈ ఆయిలను వాడొచ్చు. దీని వల్ల చర్మం కాంతివంతమవుతుంది.

  • ఈ ఆయిల్లో విటమిన్  ఇ ఉండటం వల్ల చర్మవావును తగ్గిస్తుంది. మొటిమలు తగ్గించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
  • కొంతమంది చర్మం ముడుతలు పడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఈ ఆయిల్​ ను  నిమ్మరసం తో కలిసి ముడుతలున్న బాగంలో రాస్తే ఫలితం ఉంటుంది.
  • పగులుతున్న పెదాలకు ఈ నూనె వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
  • అరికాళ్ల పగుళ్లను నయం చేస్తుంది.
  • ఆలివ్​ లో  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మకాంతి పెంచుతాయి.
  • దద్దుర్లు.. దురద ఉన్న బాగాల్లో ఈ ఆయిల్ రాస్తే, కొంతవరకు తగ్గుతాయి.
  • మేకప్​ వేసుకొనేవాళ్లకు ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది.  

ALSO READ :  చిక్కుడుతో జలుబు, దగ్గుకు చెక్ పెట్టండి..

వెలుగు, లైఫ్