చలితో పోట్లాడి, చలివల్ల వచ్చే జబ్బులను ఎదిరించి నిలబడాలంటే చిక్కుడుకాయలను ఆహారంలో చేర్చాల్సిందే. ఈ సీజన్లో విరివిగా లభించే చిక్కుడు కాయలతో వెరైటీ కూరలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . !
చిక్కుడు నిల్వపచ్చడి తయారీకి కావలసినవి
- చిక్కుడుకాయలు: కేజీ
- మెంతి పొడి 1 టేబుల్ స్పూన్
- ఆవపొడి 1 టేబుల్ స్పూన్
- పసుపు : 1/3 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి: 3
- ఉప్పు : 3 లేదా 4 స్పూన్లు
- కారం : 3 లేదా 4 స్పూన్లు
- నూనె : తగినంత
- పోపు గింజలు(పప్పులు): 1 టేబుల్ స్పూన్
- ఆవాలు: టేబుల్ స్పూన్లు
- జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు : ఆ లేదా3 కొమ్మలు
తయారీ విధానం: చిక్కుడుకాయలను కడిగి, పైన, కింది భాగాలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. తడి తుడిచి పూర్తిగా ఆదే వరకు నీడలో అరబెట్టాలి. తరువాత పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసి చిక్కుడుకాయ ముక్కలను కొంచెం మెత్తబడేలా వేగించాలి (డీప్ ఫ్రై చేయకూడదు) . వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తరువాత వెల్లులి పొట్టు తీయాలి. చిక్కుడుకాయల్లో ఉప్పు, కారం, వెల్లుల్లి, పసుపు, మెంతిపొడి, కారం వేసి కలపాలి. పొయ్యి మీద బాండీ పెట్టి పచ్చడికి సరిపడినంత నూనెపోసి వేడి చేయాలి. అందులో పోపు గింజలు (పప్పులు), ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 5 వెల్లులి రెబ్బలు వేసి వేగించాలి. పక్కన పెట్టు కున్న చిక్కుడుకాయ మిశ్రమంలో ఈ నూనెను వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం వేసి కలపాలి. దీన్ని ఒక గాజు జాడీలోకి తీసుకొని నిల్వ చేసుకుంటే ఒక నెలపాటు నిల్వ ఉంటుంది. . .
చిక్కుడుకాయ ఉల్లికారం తయారీక కావలసినవి:
- చిక్కుడు కాయ - 1/2 కిలో
- ఉల్లిపాయ తరుగు 3
- పచ్చిమిర్చి- 2
- ఎండుమిర్చి: 2
- వెల్లుల్లి : 6 రెబ్బలు
- జీలకర్ర : 1 టీస్పూన్
- నిమ్మకాయ 1
- ఉప్పు తగినంత
- కారం-తగినంత
- పసుపు : చిటికెడు
- కొత్తమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు
పోపుకోసం
- నూనె : 3 స్పూన్లు
ఆవాలు: 1 టీస్పూన్ - జీలకర్ర: 1/4 టీ స్పూన్
- మినపప్పు 1 టీస్పూన్
- శెనగపప్పు : 1 టీస్పూన్
- కరివేపాకు: 2 రెమ్మలు
తయారీ విధానం: చిక్కుడుకాయలను శుభ్రం చేయాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. తరువాత నీళ్లను మొత్తం తీసేసి పక్కన పెట్టాలి. ఉల్లి తరుగును తీసుకుని అందులో వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, నిమ్మరసం వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత పొయ్యిమీద బాండీ పెట్టి నూనెవేసి శెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేగించి తరువాత పచ్చిమిర్చి. కరివేపాకు కూడా వేసి కాసేపు వేగించాలి. తరువాత అందులో ముందుగా చేసుకున్న ఉల్లికారంను వేసి అందులో కొద్దిగా పసుపు వేసి వేగించాలి. అవి వేగాక చిక్కుడుకా యలను కొంచెం ఉప్పు వేసి మరికాసేపు వేగించాలి.
పుట్నాల పప్పుతో చిక్కుడు పచ్చడి తయారీకి కావలసినవి
- చిక్కుడు కాయలు : 1/4 జీ
- పుట్నాల పప్పు - 2 టేబుల్ స్పూన్లు
- కారం 1 టేబుల్ స్పూన్
- ఉప్పు తగినంత
- ఆవాలు 1 టీస్పూన్
- జీలకర్ర, 1 టీస్పూన్
- ఎండుమిరి: 2
- అలంవెల్లులి పేస్ట్ - చెంచా
- ఉల్లిపాయ తరుగు 1కప్పు
- కరివేపాకు: 2 రెబ్బలు,
- నూనె - తగినంత
తయారీ విధానం : ముందుగా చిక్కుడుకాయలను శుభ్రపరిచి అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. పుట్నాల పప్పుని లోకగా వేగించాలి. మిక్సీలో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేయాలి. బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేగించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేగించాలి. అందులో ఉడికించిన చిక్కు డుకాయలు పసుపు, కారం వేసి కొద్దిసేపు ఉంచాలి. చివరగా పుట్నాల పప్పు పొడి చల్లి 20 సెకండ్ల పాటు వేగించి స్టౌ ఆపేయాలి.
ALSO READ : వెరైటీ బ్రేక్ ఫాస్ట్
చిక్కుడు చికెన్ తయారీకి కావలసినవి
- చిక్కుడు కాయలు: పావుకిలో
- చికెన్ : అరకిలో
- టొమాటో ముక్కలు 1కప్పు,
- కొత్తిమీర, పుదీనా: 1/2 కప్పు
- గరం మసాలా 1 టీ స్పూన్
- ధనియాలపొడి 1 టీస్పూన్
- ఎండుకొబ్బరి: 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు- తగినంత.
- పసుపు కొద్దిగా
- కారం- 1 టేబుల్ స్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ 1టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క - 2 ముక్కలు
- లవంగాలు 4
- బిర్యానీ ఆకులు: 2
- నూనె : 4 టేబుల్ స్పూన్లు
తయారీవిధానం : పొయ్యిమీద బాండీ పెట్టి అందులో నూనె వేడి చేయాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేయాలి. అవి వేగాక అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవర కూ గరిటెతో అటు ఇటు తిప్పుతూ వేగించాలి. తరువాత అందులో చికెన్, ఉప్పు, కారం, పసుపు, కొత్తి మీర, పుదీనా వేసి 10 నిమిషాలపాటు ఉడికించాలి అందులో టొమాటో ముక్కలు, చిక్కుడు కాయలు వేసి తగినంత నీళ్లు పోయాలి. మూతపెట్టి ఉడికించాలి. తరువాత గరంమసాలా. వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లాలి.
వెలుగు, లైఫ్
