
నవీపేట్, వెలుగు : బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి నవీపేట్ మండల బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు రాజీనామా చేశారు. కవిత అనుచరుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పోస్టు ద్వారా పంపినట్లు తెలిపారు.
మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం హైదరాబాద్‌లో కవిత నివాసంలో కలిసి మద్దతు ప్రకటించారు. కవిత సొంతమండలం కావడంతో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.