- బీజేపీ రాష్ట్ర నాయకులు కర్నాటి ధనుంజయ
చండూరు, వెలుగు: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ చేసి అత్యధిక స్థానాలను గెలిచి బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కర్నాటి ధనుంజయ అన్నారు. మంగళవారం చండూరు మున్సిపల్ కేంద్రంలోని ఓ గార్డెన్ లో జరిగిన మున్సిపల్ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ఓటర్లకు చెప్పాలన్నారు.
రాబోయే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, భూతరాజు శ్రీహరి మంచుకొండ రామ్మూర్తి ఎన్నికల కన్వీనర్ బొబ్బల మురళి మనోహర్ రెడ్డి, కో- కన్వీనర్లు తడకమళ్ళ శ్రీధర్, వరికుప్పల యాదగిరి, భూతరాజు శ్రీహరి, మంచుకొండ రామ్మూర్తి, సోమ నరసింహ, అన్నపర్తి యాదగిరి, బోడ ఆంజనేయులు, పేర్ల గణేష్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
