గుడి కూల్చారని రోడ్డుపై బైఠాయింపు

గుడి కూల్చారని రోడ్డుపై బైఠాయింపు
  • బీజేపీ నేత మాధవీలత అరెస్టు  

హైదరాబాద్​ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ ఎమ్మెల్యే  కాలనీలోని ప్రభుత్వ స్థలంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని అధికారులు కూల్చేశారని ఆరోపిస్తూ కాలనీవాసులు గురువారం సాయంత్రం ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా బీజేపీ కార్యకర్తలతో కలిసి మాధవీలత ఘటనా స్థలంలో బైఠాయించారు. ఆమె మాట్లాడుతూ.. పదేళ్లుగా ఇక్కడ అమ్మవారిని కాలనీ వాసులు పూజిస్తున్నారని, ఇటీవల బోనాలు కూడా సమర్పించారని తెలిపారు.

ప్రభుత్వ భూమి పేరుతో అమ్మవారిని తొలగించడం సరికాదన్నారు. విగ్రహం తరలించిన తహసీల్దార్​ అక్కడికి రావాలని డిమాండ్​ చేశారు. బంజారాహిల్స్​ ఏసీపీ వెంకట్​రెడ్డి, సెంట్రల్​ జోన్​ ఏడీసీపీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన చేసిన మాధవీలతను పోలీసులు బలవంతంగా స్టేషన్​కు తరలించారు.