సైనికులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి..బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్

సైనికులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి..బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: దేశ సైనికుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడినందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రజలకు, సైనికులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల జాతీయ సహ ఇన్ చార్జి డాక్టర్  పొంగులేటి  సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

 కేవలం ఒక ఉప ఎన్నిక  కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలా వ్యవహరించడం దారుణమని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు ప్రజల మనోభావాలను, సైనికుల గౌరవాన్ని దెబ్బతీశాయన్నారు.