ముంపు ప్రాంతాలను పరిశీలించిన బీజేపీ నాయకులు

ముంపు ప్రాంతాలను పరిశీలించిన బీజేపీ నాయకులు

జనగామ అర్బన్/ తొర్రూరు, వెలుగు: తుఫాన్​ కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో బీజేపీ నాయకులు పర్యటించారు. బుధవారం జనగామ జిల్లా చీటకోడూర్​లో తెగిపోయిన బ్రిడ్జిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్​ఆధ్వర్యంలో సందర్శించారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్​ చేశారు. అంతకుముందు ఆయన బ్రిడ్జి నిర్మాణం కోసం నిరసన తెలిపిన యువకులు అరెస్ట్ కావడంతో వారిని పరామర్శించారు. వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. 

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో తుఫాన్​ వల్ల దెబ్బతిన్న పంటలను బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు లేగా రాంమోహన్​రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. ​​