
యాదాద్రి భువనగిరి జిల్లా: అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్న వ్యక్తి ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు మాజీమంత్రి, టీఆర్ఎస్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు. యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిప్పి కొడితే తెలంగాణలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ మూడు సీట్లు కూడా గెలవరని.. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని మొన్నటీ మోడీ సభతోనే ప్రజలకు తెలిసిపోయిందన్నారు. భారతదేశంలోనే పేద వర్గాల కోసం పని చేసే నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. సోమవారం మోత్కుపల్లి పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శంచుకుని ప్రత్యేక పూజలు చేశారు.