
శంషాబాద్. వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు మెయిల్ ద్వారా హెచ్చరించాడు. దీంతో పోలీస్ ఇంటిలిజెన్స్, ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమై విమానాశ్రమంలో అనువణువూ తనిఖీలు చేశారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు లభించకపోవడంతో తప్పుడు సమాచారం అందినట్లుగా గుర్తించారు. బెదిరింపు మెయిల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.