ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ రేపటికి వాయిదా

ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ రేపటికి వాయిదా

ముంబై:  క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం ఎటూ తేలలేదు. వాదనలు ముగియకపోవడంతో.. రేపు(బుధవారం) మధ్యాహ్నం రెండున్నరకు వింటామని చెప్పింది బాంబే హైకోర్టు. ఆర్యన్ ఖాన్ తరపున మాజీ అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ రికవరీ చేయలేదని, డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు రోహత్గీ. అర్బాజ్ ఖాన్ షూలో 6 గ్రాముల గంజాయి దొరికిందని.. దీని ఆధారంగా ఇన్ని రోజులు జైలులో పెట్టడం సరికాదన్నారు. ఇక.. వాట్సాప్ చాట్స్ విషయంలోనూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అవాస్తవాలు చెప్పిందన్నారు రోహత్గీ. వాట్సాప్ చాట్ అంతా 2018 కి సంబంధించినదని.. క్రూయిజ్ షిప్ ఇష్యూతో చాట్స్ కు సంబంధం లేదని కోర్టుకు వివరించారు. లంచం ఆరోపణలతోనూ తన క్లైంట్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు రోహత్గీ.ఆర్యన్ ఖాన్ ను జైలుకు కాకుండా పునరావాసానికి పంపించాలని కోరారు.