
భాగ్యనగరం బోనమెత్తింది. హైదరాబాద్ సిటీలో బోనాల సంబురం మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎత్తడంతో తెలంగాణ అంతటా బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఆషాడంతో పాటు వచ్చే శ్రావణ మాసంలోనూ బోనాల ఉత్సవాలు చేసుకుంటారు. లంగర్ హౌజ్ నుంచి అమ్మవారి రథం, తొట్టెల ఊరేగింపు మొదలై... గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం వరకు జరగనుంది. 25 న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ, ఆగస్టు 1 న లాల్ దర్వాజా మహంకాళి బోనాల జరగనున్నాయి.