రైతులేమైనా టెర్రరిస్టులా?: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

రైతులేమైనా టెర్రరిస్టులా?: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

యాదాద్రి, వెలుగు: ‘ట్రిపుల్ఆర్​ అలైన్​మెంట్​ మార్చాలని డిమాండ్​ చేసిన రైతులపై నాన్ ​బెయిలబుల్​ కేసుల పెడతరా..? వాళ్లేమైనా టెర్రరిస్టులా?’ అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ ప్రశ్నించారు. ‘ఇక నుంచి ఆత్మ బలిదానాలు, మీ ప్లెక్సీలకు పాలాభిషేకాలు ఉండవు. బీఆర్ఎస్​పై ఆగ్రహంతో ఉన్న ప్రజలు మీ ఫ్లెక్సీలకు పెట్రోల్​ అభిషేకాలు చేస్తారు’ అని ఆయన హెచ్చరించారు. మంత్రి జగదీశ్​రెడ్డిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని బీజేపీ స్టేట్ ​లీడర్​ గూడూరు నారాయణ రెడ్డి సహా నలుగురు రైతులపై నాన్ ​బెయిలబుల్​ కేసులు పెట్టడంతో పాటు రైతులను రిమాండ్​కు పంపడంతో వారిని కలవడానికి భువనగిరి సబ్ ​జైలుకు నర్సయ్య వెళ్లారు.

అయితే ఆయన ములాఖత్​కు జైలు అధికారులు  అవకాశమివ్వలేదు. దీంతో నర్సయ్య గౌడ్​ సబ్​ జైలు ముందు బైఠాయించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి వంద ఎకరాల భూమిని కాపాడుకోవడానికి మంత్రి జగదీశ్​రెడ్డి సాయంతో కుట్రపూరితంగా అలైన్​మెంట్​మార్చారని ఆరోపించారు. మంత్రి తన బంధువు ఈఎన్​సీ గణపతి రెడ్డి సాయంతో యాదగిరిగుట్ట టెంపుల్​ వెనుక వైపు నుంచి రావాల్సిన అలైన్​మెంట్​ను మార్పించారన్నారు. పదవులను అడ్డం పెట్టుకొని రూ.వందల కోట్ల బిజినెస్​ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ ​విసిరారు. మాయ దశరథ, పడమటి జగన్మోహన్​ రెడ్డి, పడాల శ్రీనివాస్​, సూదగాని హరిశంకర్​ గౌడ్​ ఉన్నారు.