సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ట్రెంట్ బౌల్ట్ విడుదల

సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ట్రెంట్ బౌల్ట్ విడుదల

కివీస్ స్టార్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్..న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి విడుదల అయ్యాడు. దీంతో అతను వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని దేశీయ లీగ్‌లకు అందుబాటులోకి రానున్నాడు. తనను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి విడుదల చేయాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు బౌల్ట్ దరఖాస్తు చేసుకోగా..బౌల్ట్ కోరికను మన్నించిన కివీస్ బోర్డు..అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి విడుదల చేసింది. కుటుంబంతో  ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనూ బౌల్ట్ ఈ అర్జీని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ముందుంచాడు. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి బౌల్ట్ విడుదల అవడంతో..బౌల్ట్ ఫ్రీ అయ్యాడు.  తాను సెలక్షన్కు అందుబాటులో ఉన్నానని చెబితేనే సెలక్టర్లు అతన్ని సెలక్ట్ చేయాలి లేదంటే చేయడానికి వీల్లేదు. అలాగే జాతీయ జట్టు ఆడే సమయంలో..మిగతా టోర్నీల్లో ఆడకూడదనే నిబంధన కూడా అతనిపై ఉండబోదు. కీలక టోర్నీలకు మాత్రం అతను ఎంపికయ్యేందుకు అన్ని అర్హతలు బౌల్ట్ కు ఉంటాయి. 

కుటుంబం కోసమే..


సెంట్రల్ కాంట్రాక్టు నుంచి విడదల అవ్వాలన్న నిర్ణయం కఠినమైందని బౌల్ట్ చెప్పాడు. క్రికెటర్గా తాను ఈ స్థాయికి చేరుకునేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అన్ని విధాలుగా సహకరించిందని తెలిపాడు. ఈ సందర్భంగా బోర్డు అధికారులకు బౌల్ట్ ధన్యవాదాలు చెప్పాడు. దేశానికి ఆడాలన్నది తన చిన్ననాటి కల అని..ఎంతో కష్టపడి జాతీయ జట్టుకు ఎంపికయ్యానని చెప్పుకొచ్చాడు. 12 ఏళ్లుగా న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని..అందుకు చాలా గర్వంగా ఉందన్నాడు. ఈ నిర్ణయం తన కుటుంబం కోసమే తీసుకున్నానని వెల్లడించాడు. 

బాధగా ఉంది..
బౌల్ట్ నిర్ణయం పట్ల న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు విచారం వ్యక్తం చేసింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి మంచి ప్లేయర్ను కోల్పోతున్నందుకు బాధగా ఉందని న్యూజిలాండ్ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ అన్నాడు. బౌల్ట్ స్థానాన్ని తాము ఎప్పటికీ గౌరవిస్తామని..అతను తమతో అన్ని విషయాలు పంచుకున్నాడని వెల్లడించింది. 2011 నుంచి ఇప్పటి వరకు న్యూజిలాండ్ క్రికెట్కు ఎంతో సహకారం అందించాడని చెప్పుకొచ్చాడు. బౌల్ట్ అన్ని ఫార్మాట్లలో వరల్డ్లోనే అత్యుత్తమ ప్లేయర్ అని కొనియాడాడు. కివీస్ తరపున ఇన్ని ఘనతలు సాధించినందుకు తాము గర్విస్తున్నామన్నాడు. 


 
క్రికెట్ కెరీర్..
న్యూజిలాండ్ తరఫున ట్రెంట్ బౌల్ట్  ఇప్పటివరకు 78 టెస్టులు, 93 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. టెస్ట్ కెరీర్లో 27.49సగటుతో 317 వికెట్లు తీశాడు. వన్డేల్లో 169 వికెట్లు, టీ20ల్లో 62వికెట్లు సాధించాడు. 33ఏళ్ల బోల్ట్ ప్రస్తుతం  వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 ర్యాంక్‌లో ఉన్నాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.