రసమలై.. రబ్దీ.. గులాబ్ జామ్.. బ్రెడ్ డెజర్ట్స్ .. ఈ పేర్లు విన్నా, చదివినా నోట్లో నీళ్లూరాల్సిందే! అంత రుచిగా ఉంటాయి కాబట్టి వీటిని ఇష్టపడని వాళ్లు ఉండరు! అయితే, ఈ రుచికరమైన రెసిపీలను కాస్త కొత్తగా ట్రై చేస్తే, మరింత టేస్టీగా ఉంటాయి. ఈ మూడింటిలో మెయిన్ ఇంగ్రెడియెంట్ బ్రెడ్.. బ్రెడ్ తో టేస్టీగా ఉండే రసమలైను చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. .. మరి ఇంకెందుకాలస్యం.. ఈ స్వీట్ ను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . . !
రసమలై తయారీకి కావాల్సినవి
- బ్రెడ్ ముక్కలు: ఆరు
- పాలు: అర లీటరు
- చక్కెర: రెండున్న టేబుల్ స్పూన్లు
- బాదం, పిస్తాపప్పు తరుగు: రెండు టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి: అర టీస్పూన్
- కుంకుమ పువ్వు: చిటికెడు
తయారీ విధానం : పాలను పొంగు వచ్చేవరకు కాగబెట్టాలి. తర్వాత అందులో చక్కెర వేసి కలపాలి. బాదం, జీడిపప్పు తరుగు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి ఆ మిశ్రమాన్ని బాగా మరిగించాక పక్కన పెట్టాలి. బ్రెడ్ ముక్కలను గుండ్రంగా లేదా నచ్చిన ఆకారంలో కట్ చేయాలి. వాటిని పాల మిశ్రమంలో ముంచి ఒక గిన్నెలో వేయాలి. ఆపై మిగిలిన మిశ్రమాన్ని వాటిపై పోస్తే.. ఎంతో రుచికరమైన రసమలై రెడీ.
