భూభారతి.. భూమేతగా మారింది : హరీశ్ రావు

భూభారతి.. భూమేతగా మారింది :  హరీశ్ రావు
  • హరీశ్ రావు ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: భూమి సమస్యలు, రిజిస్ట్రేషన్ ఆలస్యం వంటి సమస్యల వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. 'రైతుల భూమి హక్కులను 100 శాతం 
కాపాడతాము' అని ఇచ్చిన హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌‌‌‌ను పేరు మార్చి తెచ్చిన భూ భారతి.. ఇప్పుడు అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూమేత, భూహారతిగా మారిందని విమర్శించారు.