- రాష్ట్రంలోని మాలలంతా తరలిరావాలి: చెన్నయ్య
హైదరాబాద్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ సర్కారు రోస్టర్ విధానంతో మాలలతో పాటు 25 కులాలకు తీవ్ర అన్యాయం చేసిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరో పించారు. ఈ అన్యాయంపై ఈ నెల 23న సరూ ర్‌నగర్ స్టేడియంలో మాలల రణభేరి మహాసభను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. మహాసభకు రాష్ట్రంలోని మాలలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాల మహానాడు నేతలు బూర్గుల వెంకటేశ్వర్లు, రంజిత్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
