- స్థానిక ఎన్నికల నేపథ్యంలో స్థానచలనం
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నేప థ్యంలో ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీ చేసింది. జిల్లాల ఎస్పీలు సహా రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి దేవేంద్రసింగ్ చౌహాన్‌కు అడిషనల్ డీజీ (పర్సనల్)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ జాయిం ట్ సీపీ(అడ్మిన్)గా ఉన్న పరిమల హన నూతన్ జాకబ్‌ను సీఐడీ డీఐజీగా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న ఆరుగురు ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇచ్చారు.
