బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇండ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు ముగిశాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు మూడు రోజులు తనిఖీలు నిర్వహించారు. జూన్ 14వ తేదీ బుధవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సోదాలు జూన్ 16వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 2 గంటలకు కొనసాగాయి.  ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో బుధవారం (జూన్ 14) తొలిరోజు సోదాలు ముగిశాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు మూడు రోజులు సోదాలు నిర్వహించారు.

మూడు రోజులపాటు సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు జూన్ 16వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటలకు ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.  ఈ  సోదాల్లో ఐటీ శాఖ పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్స్, కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లపై ఐటీ అధికారులు ఆరాతీశారు. సోదాల అనంతరం ఎమ్మెల్యేలకు ఐటీ అధికారులు నోటీసులిచ్చారు. అవసరమైతే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.