జూబ్లీహిల్స్‌‌‌‌లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు.. కాంగ్రెస్‌‌‌‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సే: కేసీఆర్‌‌‌‌‌‌‌‌

జూబ్లీహిల్స్‌‌‌‌లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు.. కాంగ్రెస్‌‌‌‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సే: కేసీఆర్‌‌‌‌‌‌‌‌
  • సక్కదనంగ నడిచే బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌ను పోగొట్టుకున్నమని జనం బాధపడుతున్నరు
  •     ఉప ఎన్నికలో మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నరు   
  •     పదేండ్లు పస్తులుండి పైసాపైసా కూడబెట్టినం 
  • ఇప్పుడు ఆర్థిక వృద్ధిలో తెలంగాణ వెనుకబడ్డదని రిపోర్టులు వస్తుంటే కండ్లల్ల నీళ్లు వస్తున్నయన్న బీఆర్ఎస్ చీఫ్  
  •     ఎర్రవల్లి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో 3 గంటల పాటు సన్నాహక సమావేశం 
  •     నేతలను పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించిన కేసీఆర్

హైదరాబాద్/ములుగు, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఆ విజయమే తెలంగాణతో పాటు బీఆర్ఎస్ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గురువారం ఎర్రవల్లిలోని ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో దాదాపు 3 గంటల పాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. బై ఎలక్షన్‌‌‌‌లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించేలా కృషి చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 
‘‘కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారు. 

సక్కదనంగ నడిచే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని వాళ్లు బాధపడుతున్నరు. ఇలాంటి సందర్భంలో ఉప ఎన్నికలు వచ్చినయ్. కాంగ్రెస్‌‌‌‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో క్లారిటీతో ఉన్నది. జూబ్లీహిల్స్‌‌‌‌లో బీఆర్ఎస్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేసిన్రు. ఇక మీ పని భారీ మెజారిటీ సాధించడం కోసం పని చేయడమే. అందుకు నేతలంతా వ్యూహంతో పని చేయాలి. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ వాళ్ల హృదయాలను గెలవాలి” అని దిశానిర్దేశం చేశారు. చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోల్ అయ్యేలా శ్రమించాలని సూచించారు. 

ఆర్థిక వ్యవస్థ ఆగం.. 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ ఆగం పట్టించిందని కేసీఆర్ విమర్శించారు. ‘‘పల్లెల్లో రైతులే కాకుండా హైదరాబాద్‌‌‌‌ ప్రజల చేతుల్లో కూడా పైసలు ఆడక పరేషాన్‌‌‌‌లో పడ్డరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రంగమూ సరిగా లేదు. మేం పదేండ్ల పాటు పస్తులుండి పైసా పైసా కూడబెడితే.. రెండేండ్లు కూడా నిండకుండానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ఖతం పట్టించింది” అని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్లయింది. ఇక జూబ్లీ హిల్స్‌‌‌‌లో ఓ రౌడీషీటర్‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టి  ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. ప్రజలు ఆ రౌడీషీటర్‌‌‌‌‌‌‌‌ను ఓడించి సిటీలో శాంతి భద్రతలను కాపాడుకుంటారు” అని అన్నారు. 

కండ్లల్ల నీళ్లు వస్తున్నయ్..  

బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగంలో ముంబై , ఢిల్లీతో తెలంగాణ పోటీ పడే పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూలగొడుతూ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూల్చిందని కేసీఆర్ విమర్శించారు. “పదేండ్ల పాలనలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి గంటలు గంటలు ఆలోచన చేసినం.  ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌‌‌‌గా నిలిపినం. కుటుంబానికైనా, రాష్ట్రానికైనా పతార ఉంటేనే కదా.. అతార (డిమాండ్) పెరిగేది. 

మనం పైసా పైసా కూడబెట్టి ప్రగతి సాధిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో అది మైనస్‌‌‌‌లోకి వెళ్లిపోతున్నది. కాంగ్రెస్ వచ్చిన రెండేండ్లలో ఆర్థిక వృద్ధిలో తెలంగాణ చివరి స్థానంలో ఉన్నట్టు రిపోర్టులు వస్తుంటే .. కండ్లల్ల నీళ్లు వస్తున్నయ్” అని అన్నారు. ‘‘రాష్ట్రాన్ని ఆగం చేసిన కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది. ఇక బీజేపీ గురించి అడిగితే అదెక్కడుందని ప్రజలే ఉల్టా అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు బీజేపీ గురించి ఆలోచనే లేదు” అని పేర్కొన్నారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు, మాగంటి సునీత, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఉత్సాహంగా కేసీఆర్.. 

సమావేశంలో కేసీఆర్ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. మీటింగ్‌‌‌‌కు హాజరైన నేతలను పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలన్నా, మళ్లీ అధికారం దక్కాలన్నా జూబ్లీహిల్స్​ఉప ఎన్నికలో గెలవడం అత్యంత అవసరమని తేల్చి చెప్పారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత  కేసీఆర్ పూర్తిగా ఫాంహౌస్‌‌‌‌కే పరిమితమయ్యారు. ఇన్నాళ్లు తనను కలిసేందుకు వచ్చిన నేతలతోనూ ఆయన ముభావంగానే కనిపించారు. కానీ తాజాగా జరిగిన సమావేశంలో యాక్టివ్‌‌‌‌గా కనిపిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు.