భారత్లో చొరబడ్డ పాక్ అడ్వాన్స్డ్ డ్రోన్

 భారత్లో చొరబడ్డ పాక్ అడ్వాన్స్డ్ డ్రోన్

అమృత్సర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఏమాత్రం తగ్గడం లేదు. అదను చూసి మళ్లీ మళ్లీ కవ్వింపులకు పాల్పడుతోంది. నిన్న శుక్రవారం రాత్రి  అమృత్ సర్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలను జవాన్లు గుర్తించారు. రాత్రి సరిగ్గా 7.45 గంటల సమయంలో పాక్ వైపు నుంచి మన దేశంలోకి వస్తున్న డ్రోన్ ను భద్రతా సిబ్బంది పసిగట్టి కూల్చేశారు. 

పాకిస్తాన్ నుండి భారత భూభాగంలోకి అనుమానిత డ్రోన్ ప్రవేశిస్తున్నట్లు నిర్ధారించుకున్న సరిహద్దు భద్రతా దళం సైనికులు కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్  అమృత్‌సర్ జిల్లాలోని డావోకే గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పడింది. సైనికులు వెళ్లి చూడగా పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో ఒక క్వాడ్ కాప్టర్ DJI మ్యాట్రిస్ 300 RTK (చైనీస్ డ్రోన్)ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. క్వాడ్ కాప్టర్ అడ్వాన్స్ డ్ డ్రోన్ గా గుర్తించారు.