43 రోజుల్లో కొత్త పోస్టాఫీసు కట్టేశారు.. టెక్నాలజీ వండర్

43 రోజుల్లో కొత్త పోస్టాఫీసు కట్టేశారు.. టెక్నాలజీ వండర్

మన దేశంలో తొలి త్రీడీ ప్రింటెడ్ పోస్టాఫీస్ అందుబాటులోకి వచ్చింది. రోబోటిక్ సాయంతో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా బెంగళూర్ లో నిర్మించిన ఈ బిల్డింగ్ ను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ బిల్డింగ్ ను 1,021 చదరపు అడుగుల్లో కేవలం 43 రోజుల్లో నిర్మించామని అధికారులు తెలిపారు. 

సాధారణంగా మనుషులతో కడితే 6 నుంచి 8 నెలలు పడుతుందని చెప్పారు. దీన్ని ఐఐటీ మద్రాస్ టెక్నికల్ గైడెన్స్ లో ఎల్అండ్ టీ కంపెనీ నిర్మించిందని పేర్కొన్నారు. దీన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడని, ఇది మన దేశ అభివృద్ధికి నిదర్శనమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

టెక్నాలజీలో ముందున్న బెంగళూరు .. దేశానికి ఎప్పుడూ ఓ కొత్త విషయాన్ని అందిస్తోందని రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవి తెలిపారు. దేశంలోనే తొలి త్రిడి ప్రింటెడ్ ఫోస్ట్ ఆఫీస్ ను బెంగళూర్ లో రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. త్రిడి టెక్నాలజీతో అల్సూర్ బజార్ పోస్టాఫీస్ ను ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించింది. రూ. 23 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించారు.  సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి.. భవిష్యత్ భారతావానికి స్ఫూర్తినిస్తోందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.