పొరపాటున అకౌంట్ లోకి రూ. 15 లక్షలు

పొరపాటున అకౌంట్ లోకి రూ.  15 లక్షలు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దావర్ వాడీ కి చెందిన రైతు ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే... కొంతకాలం క్రితం తన బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అందులో 15 లక్షలు ఉండటంతో... ప్రధాని మోడీ పంపారని... ఇల్లు కట్టుకున్నాడు.... మరో 6 లక్షలు ఏం చేయాలా అని ఆలోచనలో పడిపోయాడు. ప్రధాని జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు జమ అవ్వడంతో.... ఆ డబ్బంతా ప్రధాని మోడీనే తన అకౌంట్ లో వేశాడని సంతోష పడిపోయాడు. అందుకు థ్యాంక్స్ చెప్తూ ప్రధాని కార్యాలయానికి మెయిల్ కూడా పంపాడు. 9 లక్షలతో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మిగితా డబ్బు ఏం చేద్దామా అనుకునే లోపే... డబ్బు వేరేవారిదని గ్రామ పంచాయతీ నుంచి లేఖ అందింది. ఆ డబ్బు తమదని...... జిల్లా పరిషత్ నుంచి పింపల్ వాడీ గ్రామపంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ అకౌంట్ లో పడ్డాయని లెటర్ వచ్చింది. ఆ డబ్బును వెంటనే తిరిగి చెల్లించాలని లెటర్ లో తెలిపారు. దీంతో అతని దగ్గరున్న 6 లక్షలు కట్టాడు. మిగితా 9 లక్షలు ఎలా కట్టాలా అని తలపట్టుకున్నాడు ధ్యానేశ్వర్.